Science Museum | సైన్స్ మ్యూజియంలో ఉద్యోగావ‌కాశాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Science Museum | నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్ (ఎన్‌సీఎస్ఎం) National Council of Science Museums ఆధ్వ‌ర్యంలోని మ్యూజియంలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. టెక్నిషియ‌న్స్‌ Technicians, టెక్నిక‌ల్ అసిస్టెంట్లు Technical Assistants, ఆర్టిస్ట్‌, ఆఫీస్ అసిస్టెంట్లు క‌లిపి 30 పోస్టుల‌కు అర్హులైన వారిని ద‌ర‌ఖాస్తుల‌ను ఎన్‌సీఎస్ఎం NCSM ఆహ్వానిస్తోంది. ఏదైనా డిప్లొమా పాస్ అయిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కోల్‌క‌తా Kolkata, భువ‌నేశ్వ‌ర్‌ Bhubaneswarల‌లో ప‌ని చేయాల్సి ఉంటుంది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Science Museum | నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియ‌మ్స్ (ఎన్‌సీఎస్ఎం) National Council of Science Museums ఆధ్వ‌ర్యంలోని మ్యూజియంలో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. టెక్నిషియ‌న్స్‌ Technicians, టెక్నిక‌ల్ అసిస్టెంట్లు Technical Assistants, ఆర్టిస్ట్‌, ఆఫీస్ అసిస్టెంట్లు క‌లిపి 30 పోస్టుల‌కు అర్హులైన వారిని ద‌ర‌ఖాస్తుల‌ను ఎన్‌సీఎస్ఎం NCSM ఆహ్వానిస్తోంది. ఏదైనా డిప్లొమా పాస్ అయిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. కోల్‌క‌తా Kolkata, భువ‌నేశ్వ‌ర్‌ Bhubaneswarల‌లో ప‌ని చేయాల్సి ఉంటుంది.

Science Museum | మే 26 వ‌ర‌కు గ‌డువు

ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు మే 26 వ‌ర‌కు గ‌డువు విధించారు. 24.05.2025 నాటికి అభ్య‌ర్థుల గ‌రిష్ట వ‌య‌స్సు 35 ఏళ్లకు మించ‌కూడ‌దు. ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. పోస్టును బ‌ట్టి నెల‌కు రూ.38,908 వేత‌నం ఇస్తారు. విద్యార్హ‌త‌తో పాటు ఇంట‌ర్వ్యూ ఆధారంగా సెల‌క్ష‌న్ ఉంటుంది. అభ్య‌ర్థులు ఆన్‌లైన్ NCSM.gov.in/Notice/Career లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజు ఓసీలు అయితే రూ.885 చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ కేట‌గిరీ Ex-Servicemen Category వారికి ఉచితం.

Science Museum | అర్హ‌త‌లు ఇవే..

టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టుకు కంప్యూట‌ర్ సైన్స్‌ Computer Science, సివిల్‌, మెకానిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. 13 టెక్నిషియ‌న్ పోస్టులు ఉండ‌గా, అందులో ఐదు ఫిట్ట‌ర్‌; 6 కార్పెంట‌ర్‌, ఎల‌క్ట్రానిక్స్‌, ఎల‌క్ట్రిక‌ల్స్ ఒక్కోటి చొప్పున పోస్టులు ఉన్నాయి. తొమ్మిది టెక్నిక‌ల్ అసిస్టెంట్ పోస్టులు ఉండ‌గా, ఒక‌టి ఎల‌క్ట్రానిక్స్‌, రెండు చొప్పున ఎల‌క్ట్రిక‌ల్‌, కంప్యూట‌ర్‌, మెకానిక‌ల్, సివిల్ పోస్టులు ఉన్నాయి. రెండు ఆర్టిస్ట్ పోస్టులు, ఆరు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కోల్‌క‌తా, భువ‌నేశ్వ‌ర్‌లోని వివిధ సంస్థ‌ల్లో గ‌ల ఆయా పోస్టులు అభ్య‌ర్థులు మే 26 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...