అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘‘స్వచ్ఛ ఏవం’’ (Swachha Evem) హరిత విద్యాలయాల రేటింగ్ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో 8 పాఠశాలలు ఎంపికైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (District Education Officer Ashok) తెలిపారు.
16 అంశాలపై ఉన్నత ప్రమాణాలు పాటించి పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా శుభ్రంగా ఉంచడంతో జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను సాధించాయి. ఈ పాఠశాలలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) జ్ఞాపికలతో శుక్రవారం సత్కరించారు. భవిష్యత్తులో మరింత ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
Nizamabad City | రాష్ట్రస్థాయికి ఎంపికైన పాఠశాలలు
జిల్లాలో ఎంపికైన ఎనిమిది పాఠశాలలు రాష్ట్రస్థాయిలో పాల్గొననున్నాయి. సుద్దపల్లి జెడ్పీహెచ్ఎస్, కంజర బాలికల గురుకులం, కోమన్ పల్లి జెడ్పీహెచ్ఎస్, బోర్గాం(పి) జడ్పీహెచ్ఎస్, లింగాపూర్ ప్రాథమిక పాఠశాల, మావంది కలాన్ ప్రాథమిక పాఠశాల, అంభం ప్రాథమికోన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.
