అక్షరటుడే, జనగామ : Scholarship Applications | ఎస్సీ న్యాయవాద పట్టభద్రుల స్కాలర్షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి డాక్టర్ విక్రమ్ తెలిపారు. కొత్తగా న్యాయవాద పట్టా పొందిన ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు సంవత్సర ఆదాయం రూ. లక్షలకు మించకుండా ఉండాలన్నారు. మొదటి సంవత్సరంలో డిజిటల్ బుక్స్ కంప్యూటర్ డ్రెస్సెస్ కొనుగోలుకు రూ.50 వేలు, శిక్షణ కాలంలో, తదనంతరం ప్రతినెలా రూ.3 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జూలై 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.