అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SBI Health Alpha | ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ హెల్త్ ఆల్ఫా (Health Alpha) పేరుతో ఇన్సూరెన్స్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. 50కి పైగా కవరేజ్ ఆప్షన్లు కలిగి ఉన్న ఈ పాలసీని 91 రోజుల వయసున్న పిల్లల నుంచి ఎవరైనా తీసుకోవచ్చు.
దేశంలో ప్రముఖ ఇన్సూరెన్స్ సేవలందించే సంస్థలలో ఒకటైన ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తన వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త సమగ్ర ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీని తీసుకువచ్చింది. ప్రస్తుత కాలంలో వైద్య ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, అన్ని వయసుల వారికి మెరుగైన రక్షణ కల్పించడానికి హెల్త్ ఆల్ఫా పేరుతో దీనిని తీసుకువచ్చినట్లు సంస్థ పేర్కొంది. జీఎస్టీ సంస్కరణల (GST Reforms) తర్వాత సంస్థ తీసుకువచ్చిన మొదటి ఆరోగ్య బీమా ఇది. ఈ ప్లాన్ ప్రత్యేకతలు తెలుసుకుందామా..
జీవన విధానాలు, ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగ్గట్లు 50కి పైగా కవరేజీ ఆప్షన్లతో (Coverage Options) ఇది లభిస్తుంది. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపికలు చేసుకునేందుకు ఇందులో వెసులుబాటు ఉంటుంది.
- పది రెట్ల వరకు క్యుములేటివ్ బోనస్ (Cumulative bonus) : క్లెయిమ్ చేయని సంవత్సరాలకు గరిష్టంగా 10 రెట్లు క్యుములేటివ్ బోనస్ అందిస్తుంది.
- గరిష్టంగా ఐదేళ్లకు పాలసీ కొనసాగించుకునే వారికి వైద్య ద్రవ్యోల్బణం నుంచి రక్షణకోసం టెన్యూర్ ఆధారిత డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
- ఇండస్ట్రీలోనే మొదటిసారిగా ప్రత్యేక అదనపు కవర్ అందిస్తున్నారు. వ్యాయామం లేదా హాబీ స్పోర్ట్స్‌లో గాయాలపై ఓపీడీ (OPD) ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు, డయాగ్నోస్టిక్ పరీక్షలు, మెడిసిన్లు, ఫిజికల్ థెరపీ కవర్ సౌకర్యం ఉన్నాయి.
- ఈ పాలసీ బేస్ సమ్ ఇన్ష్యూర్డ్ పరిమితి లేకుండా ఉంటుంది. పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం, ఎంత మొత్తం క్లెయిమ్ అయినా చెల్లిస్తారు.
- జీవితంలో ఒక్కసారి, ప్రాథమిక సమ్ ఇన్షూరెన్స్‌ను మించిపోయే ఒక క్లెయిమ్‌కు అదనపు ఆసుపత్రి ఖర్చుల కవరేజ్ చేసే ఫెసిలిటీ.
- ఈ ప్రత్యేక అదనపు ప్రయోజనం వల్ల పాలసీదారు సంపాదించిన వెయిటింగ్ పీరియడ్ కంటిన్యూయిటీని కొత్తగా పెళ్లి అయిన జీవిత భాగస్వామికి (గరిష్ఠంగా 35 ఏళ్ల వయసు వరకు), నవజాత శిశువులకు (గరిష్టంగా ఇద్దరు పిల్లలు) వర్తింపజేయవచ్చు. అయితే వారు వివాహం లేదా పుట్టిన తేదీ నుంచి 120 రోజులలోపు పాలసీలో చేరాల్సి ఉంటుంది.
కోట్ జనరేట్ చేసిన అయిదు రోజుల్లోగా పాలసీని కొనుగోలు చేస్తే ఐదు శాతం వెల్కమ్ డిస్కౌంటు లభిస్తుంది. పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా కవరేజ్ పరిమితులను మార్చుకోవడం, సబ్ లిమిట్లు ఎంచుకోవడం, వెయిటింగ్ పీరియడ్‌లను సవరించుకునే పూర్తి స్వేచ్ఛను ఈ పాలసీ అందిస్తుంది.