అక్షరటుడే, వెబ్‌డెస్క్: Saudi Arabia gold reserves | చమురు నిల్వలతో ప్రపంచంలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సౌదీ అరేబియా.. ఆ దేశంలో తాజాగా భారీగా బంగారం నిల్వలు బయట పడటంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని రాజకీయ పరిస్థితులు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాగా, తాజాగా సౌదీలో బంగారం నిల్వలు బయటపడటంతో ధరలపై ఏమైనా ప్రభావం ఉండనుందా.. అనే కోణంలో విశ్లేషకులు శోధిస్తున్నారు.
సౌదీ అరేబియాలోని నాలుగు ప్రాంతాల్లో భారీగా బంగారం నిక్షేపాలను కనుగొన్నారు. వీటన్నింటిలో కలిపి దాదాపు 78 లక్షల ఔన్సుల గోల్డ్‌ను గుర్తించినట్లు ప్రభుత్వ రంగ మైనింగ్ సంస్థ మాడెన్ (Maaden) వెల్లడించింది.
వాడి అల్ జౌ, మంసూరా–మస్సారా, ఉరుక్, ఉమ్ అస్ సలాం ప్రాంతాల్లో ఈ పసిడి నిక్షేపాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. తాజా బయట పడిని నిల్వలతో మంసూరా–మస్సారా గనిలో బంగారు నిల్వలు సుమారు 1.04 కోట్ల ఔన్సులకు చేరుకోవడం గమనార్హం.
Saudi Arabia gold reserves | ఇతర లోహాలపైనా అన్వేషణ
బంగారంతోపాటు అరేబియన్ షీల్డ్‌లో రాగి, నికెల్ తదితర లోహాలపైనా అన్వేషణ కొనసాగిస్తున్నారు. కానీ, బంగారు నిక్షేపాలపైనే అధికారిక ప్రకటన వెలువడింది. విజన్ 2030ని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశపెట్టారు. చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థలో మైనింగ్‌ను మూడో కీలక స్థంభంగా చేర్చాలన్నదే ఈ విజన్ ప్రధాన లక్ష్యం. కాగా, తాజాగా గోల్డ్ నిక్షేపాలు బయటపడటం అనేది ఆయన వ్యూహానికి బలాన్ని ఇస్తున్నట్లు చెబుతున్నారు.