అక్షరటుడే, లింగంపేట: Mla Madan Mohan | గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ (Mla Madan Mohan) పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని (YellaReddy constituency) నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Mla Madan Mohan | విధుల పట్ల అవగాహన ఉండాలి..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. సర్పంచ్‌లు అందరూ తమ విధులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు (ward members) పరస్పర సహకారంతో గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. సర్పంచ్ల విధి నిర్వహణలో వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలని, అదేవిధంగా మహిళా సర్పంచ్ల స్థానంలో కుటుంబ సభ్యులు జోక్యం చేసుకోకుండా, మహిళా సర్పంచ్‌లు ముందుండి వారి విధులు నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. మనమంతా కలిసి పునర్నిర్మాణం చేసుకుంటూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించేదుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Mla Madan Mohan | ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు..
ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు, తాగు నీరు, ప్రాథమిక ఆరోగ్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుదామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి పంచాయతీ కార్యాలయంలో (panchayat office) లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు. నెలకు రెండు సార్లు ప్రభుత్వ పాఠశాలల్లో జీపీ పాలకవర్గం మొత్తం వెళ్లి మధ్యాహ్నం భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించి ప్రతి సర్పంచ్‌కు తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు (Indiramma houses) ఇవ్వడం తన ఆశయం అని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సర్పంచ్‌లు హుందాగా వ్యవహరించాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లాలన్నారు. గ్రామాభివృద్ధిలో అందరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు.
Mla Madan Mohan | కష్టపడ్డ వారికి పార్టీ గుర్తింపు ఇస్తుంది..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పని చేసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు, గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. 209 గ్రామ పంచాయతీల్లో 176 చోట్ల కాంగ్రెస్ జెండా ఎగిరిందని, ఇది మామూలు విజయం కాదన్నారు. ప్రజల తీర్పు, కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 46 సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించామన్నారు. ఈ ఫలితాలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని నిరూపితమైనదని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే ఉత్సాహంతో రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇంతకంటే మంచి ఫలితాలను సాధించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా అందించాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో 8 మండలాల అధ్యక్షులు, ఏఎంసీ ఛైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.