అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) సూచించారు. కామారెడ్డి పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మంగళవారం నూతన సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ, కింగ్స్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ సర్పంచులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటివని, ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలను (government schemes) సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందని తెలిపారు.
Minister Seethakka | తాగునీరు, పారిశుధ్య పనులు
తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సీతక్క సూచించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని, వాటిని అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో సర్పంచులు (sarpanches) కీలక పాత్ర పోషించాలన్నారు. గత రెండేళ్లుగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసమే ఎన్నికలు నిర్వహించకుండా ఆపామని తెలిపారు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధిపై స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ సమావేశం ఉంటుందన్నారు. మార్చిలోపు ఎన్నికలు నిర్వహించకుంటే నిధులు వెనక్కి పోయేవని తెలిపారు.
Minister Seethakka | వారం రోజుల్లో కేంద్ర నిధులు..
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు రూ.237 కోట్లను విడుదల చేసిందని, వారం రోజుల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా విడుదల అవుతాయని తెలిపారు. సర్పంచ్ పదవి ఉంటే సరిపోదని, పని ఎలా చేయాలో తెలియాలనే ఉద్దేశంతో శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నియెజకవర్గంతో పాటు జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కైవసం అయ్యాయని, ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) సైతం గెలిపించాలని సూచించారు. సర్పంచులు సమస్యలను అన్నిటినీ పరిష్కరిస్తామని, వచ్చిన నిధులతో ప్రజలకు ఎక్కడ నిధులు అవసరమో, అత్యవసరం ఏదో గుర్తించి ఖర్చు చేయాలని సూచించారు.
Minister Seethakka | గ్రామాల్లోనే ఉండాలి
సర్పంచులు గ్రామాల్లోనే ఉండాలని, పుట్టిన ఊరిని మర్చిపోవద్దని, ఊరుకు సేవ చేయాలని, కన్నతల్లిలా చూసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సంక్షేమం పథకాలను ఇంటింటికీ చేర్చాలన్నారు. పేదలకు ఆర్థిక భారం పడవద్దని ఉచిత కరెంట్ ఇస్తున్నామని, సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నామన్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జీరో చైల్డ్ మ్యారేజెస్ స్టేట్‌గా ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఆస్తులు, అంతస్థులు శాశ్వతం కాదని, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండేలా పని చేయాలని సూచించారు.