అక్షరటుడే, కామారెడ్డి : Machareddy | విష ప్రయోగంతో 600 కుక్కలను హతమార్చిన ఘటనలో మాచారెడ్డి మండలంలోని ఐదుగురు సర్పంచులపై (Sarpanches) కేసులు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Machareddy | స్ట్రే యూనిమల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో..
స్ట్రే యానిమల్ ఫౌండేషన్ (Stray Animal Foundation) ప్రతినిధులు కుక్కలపై విషప్రయోగం జరిగిన విషయాన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే గ్రామాల్లో అంతర్గతంగా బయటకు పొక్కకుండా జరిగిన ఈ ఘటన ఫౌండేషన్ ప్రతినిధులకు ఎలా తెలిసిందన్న ప్రశ్నలు సర్పంచులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలను కుక్కల బెడద నుంచి కాపాడేందుకు చేసిన ఘటన ఒక్కసారిగా తమ మెడకు చుట్టుకోవడంతో ఆ సర్పంచులు ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Machareddy | ఎన్జీవోలకు ఎలా తెలిసింది..
ఈ క్రమంలో అసలు ఎన్జీవోలకు (NGO) ఈ విషయం ఎలా తెలిసిందన్న దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వేర్వేరుగా సమాచారం తెలుసుకునే పనిలో పడ్డట్లుగా ప్రచారం సాగుతోంది. గ్రామం దాటి బయటకు వెళ్లని విషయం ఏకంగా జంతు ప్రేమికులకు చేరవేయడంలో ఎవరి హస్తం ఉందని తెలుసుకునే ప్రయత్నంలో సర్పంచులు ఉన్నట్లుగా సమాచారం.