అక్షరటుడే, బాన్సువాడ: Varni | ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లకు అధికారులు నియామకపత్రాలు అందజేస్తున్నారు. వర్ని మండలంలోని సైదాపూర్ తండా గ్రామానికి (Saidapur Thanda village) చెందిన బానోత్ శ్రీరామ్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం అధికారులు సర్పంచ్‌గా (Sarpanch) నియామక పత్రం అందజేశారు.
బానోత్ శ్రీరామ్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. కుటుంబరీత్యా హైదరాబాద్ వెళ్లి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి తన స్వగ్రామానికి సేవలందించాలనే సంకల్పంతో 2018లో సర్పంచ్‌గా పోటీచేసి అతితక్కువ మెజారిటీతో ఓటమి పాలయ్యాడు. ఈసారి గ్రామ పెద్దలు, ప్రజల సహకారంతో ఎన్నికల బరిలో నిలిచి ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా బానోత్ శ్రీరామ్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. యువకుడైనటువంటి తనకు అవకాశం కల్పించినందుకు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.
