68
అక్షరటుడే, గాంధారి: Gandhari | గాంధారి మండలం గొల్లాడి తండావాసులు సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్ల ఏకగ్రీవ ఎన్నికకు తీర్మానం చేశారు. ఈ మేరకు శనివారం సర్పంచ్, వార్డు మెంబర్లందరినీ ఏకగ్రీవం చేస్తూ తీర్మానించుకున్నారు.
Gandhari | గొల్లాడి తండా పంచాయతీ..
గొల్లాడి తండా గ్రామపంచాయతీ (Golladi Thanda Gram Panchayat) సర్పంచ్‌గా అంకోత్ సవిత గణేష్, ఉపసర్పంచ్‌గా బస్సీ భారత్య, వార్డు మెంబర్లుగా బస్సీ సంగీత్ ధన్‌రాజ్, కేతావత్ శ్రీనివాస్, అంగోద్ బులి సైవారం, బస్సీ కంసల్య చమున, బస్సు రవీందర్ ధరాత్ హుకినీ భాయ్, బస్సీ హరిలను గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.