woman bus driver | TGSRTCలో తొలి మహిళా బస్ డ్రైవరుగా సరిత

అక్షరటుడే, హైదరాబాద్: woman bus driver మహిళామణులు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అత్యున్నత ప్రతిభతో ప్రతిచోట తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తామేంటో నిరూపిస్తున్నారు. తాజాగా డ్రైవింగ్​ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటివరకు క్యాబ్​ డ్రైవర్లు(cab drivers)గా, ఆటో డ్రైవర్లు(auto drivers)గా మహిళలు తారసపడ్డారు. ఇకపై ఆర్టీసీలోనూ వెలుగు వెలగబోతున్నారు. తాజాగా సరిత అనే మహిళ ఆర్టీసీ ప్రగతి చక్రం స్టీరింగ్​ను పట్టింది. విజయవంతంగా బస్సు నడిపింది. యాదాద్రి భువనగిరి జిల్లా […]

అక్షరటుడే, హైదరాబాద్: woman bus driver మహిళామణులు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అత్యున్నత ప్రతిభతో ప్రతిచోట తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తామేంటో నిరూపిస్తున్నారు.

తాజాగా డ్రైవింగ్​ రంగంలోనూ రాణిస్తున్నారు. ఇప్పటివరకు క్యాబ్​ డ్రైవర్లు(cab drivers)గా, ఆటో డ్రైవర్లు(auto drivers)గా మహిళలు తారసపడ్డారు. ఇకపై ఆర్టీసీలోనూ వెలుగు వెలగబోతున్నారు. తాజాగా సరిత అనే మహిళ ఆర్టీసీ ప్రగతి చక్రం స్టీరింగ్​ను పట్టింది. విజయవంతంగా బస్సు నడిపింది.

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యా తండాకు చెందిన వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతుల కూతురు సరిత. ఈ దంపతులకు అయిదుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లల వివాహాలు చేయడానికి తమకున్న మూడు ఎకరాల భూమిని అమ్మేశారు.

దీంతో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు సరిత తొలుత ఆటో డ్రైవరుగా మారారు. ఆకతాయిల వేధింపులు, అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకున్నారు. జుట్టు కత్తిరించుకుని ప్యాంటు, షర్టు ధరించి మగరాయుడిలా తయారయ్యేవారు. అయిదేళ్లపాటు సంస్థాన్‌ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపారు.

ప్రైవేటుగా పదో తరగతి చదివి పాసైన సరిత, హెవీ మోటారు డ్రైవింగు లైసెన్సు పొందారు. తదుపరి హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగు నేర్చుకున్నారు. ఆజాద్‌ ఫౌండేషన్‌ సాయంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపారు.

2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ Delhi Transport Corporation – DTC)లో బస్సు డ్రైవరుగా సరిత ఎంపిక అయ్యారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో సరిత ఒక్కరే మహిళా డ్రైవరు కావడం విశేషం. భారత్​లోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన దేశ రాజధాని ఢిల్లీలో 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపారు.

మొట్టమొదటి మహిళా బస్సు డ్రైవరుగా చరిత్ర సృష్టించిన సరిత, 2018లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకున్నారు. అంతకు ముందు 2017లో తెలంగాణ ప్రభుత్వం తరఫున కుమ్రం భీం అవార్డును సొంతం చేసుకున్నారు. తదుపరి దేశంలోని ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు అందుకున్నారు.

ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేస్తే సరితకు వచ్చే రూ.18 వేల నెలసరి వేతనం సరిపోలేని పరిస్థితి. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యానికి చేరుకోవడంతో తిరిగి తన తండాకు చేరుకున్నారు. స్థానికంగా ఉపాధి కోసం ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఈ క్రమంలో ప్రజాదర్బార్‌(Praja Darbar)లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Delhi Transport Corporation)ని సరిత కలిశారు. తెలంగాణ ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని మంత్రిని వేడుకున్నారు. స్పందించిన మంత్రి.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Transport Minister Ponnam Prabhakar), ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar) కు వీడియో కాల్ చేసి దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవరు సరిత గురించి వివరించారు. ఆమెకు ఉపాధి కల్పించాలని కోరారు.

అలా మంత్రి కోమటిరెడ్డి సిఫారసు మేరకు టీజీఎస్ ఆర్‌టీసీలో సరితకు ఉద్యోగం వరించింది. అధికారులు ఆమెకు హైదరాబాద్ డిపోలో విధులు కేటాయించారు. ఎంజీబీఎస్‌ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్‌ బస్సు నడిపి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవరుగా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవరుగా సరిత రికార్డు సొంతం చేసుకున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...