Homeజిల్లాలునిజామాబాద్​Santa Mallanna Jathara | ఆర్మూర్​లో నేడు సంతమల్లన్న జాతర

Santa Mallanna Jathara | ఆర్మూర్​లో నేడు సంతమల్లన్న జాతర

ఆర్మూర్ డివిజన్​లో సంత మల్లన్న జాతర సందడి నెలకొంది. ప్రతి ఏడాది డిసెంబర్​ మాసంలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డివిజన్​లోని అంక్సాపూర్, తొర్లికొండ, పడగల్, గోవింద్​పేట్​, ఆలూర్, తల్వేద గ్రామాల్లో ఈ సంతమల్లన్న జాతరలు నిర్వహిస్తూ వస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్ : Santa Mallanna Jathara | ఆర్మూర్ డివిజన్​ (Armoor Division)లో సంత మల్లన్న జాతర సందడి నెలకొంది. ప్రతి ఏడాది డిసెంబర్​ మాసంలో జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. డివిజన్​లోని అంక్సాపూర్, తొర్లికొండ, పడగల్, గోవింద్​పేట్​, ఆలూర్, తల్వేద గ్రామాల్లో ఈ సంతమల్లన్న జాతరలు నిర్వహిస్తూ వస్తున్నారు.

ప్రతి ఏడులాగే ఈ ఏడాది సైతం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు గ్రామకమిటీలు ఏర్పాట్లు చేశాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జాతరకు గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. సిడి (పొడవైన కర్రకు ఎద్దుల బండి ఆకారంలో బంతిపూలతో ఏర్పాటు చేసే ఆకారం)ని అలంకరించారు. సిడిని ఆదివారం గ్రామాల నుండి సంత మల్లన్న ఆలయాలకు తీసుకొచ్చారు. అనంతరం సోమవారం బోనాలతో మల్లన్న ఆలయ గిరి ప్రదక్షిణ, మంగళవారం నైవేద్యాలు, సమర్పిస్తారు. తిరిగి బుధవారం సిడి గ్రామాలకు చేరుకుంటుంది.

Santa Mallanna Jathara | ఉత్తర తెలంగాణలోనే ప్రత్యేకం..

ఉత్తర తెలంగాణ (North Telangana)లోనే సంతమల్లన్న జాతర ప్రత్యేకతను సంతరించుకుంది. వేల్పూర్​ మండలం (Velpur Mandal) అంక్సాపూర్ సంత మల్లన్న జాతర అతిపెద్ద జాతరగా చెప్పవచ్చు. ఈ జాతరకు ఆర్మూర్​తో పాటు నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్, జగిత్యాల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివచ్చి మల్లన్న ఆలయాల్లో మొక్కులు తీర్చుకుంటారు. ఆర్మూర్ డివిజన్లోని వివిధ గ్రామాలలోని షిడీల కంటే అంక్సాపూర్ (Ankshapur) సిడి పెద్దదని చెప్పవచ్చు.

Santa Mallanna Jathara | మొక్కుల కోసం బంతిపూల తొట్లెలు..

సట్టిని పురస్కరించుకొని జరిగే ఈ సంతమల్లన్న జాతరలకు విశిష్టత ఉంది. ఈ సిడి వద్ద కోరుకున్న మొక్కలు తీరాలని బంతిపూల తోట్లెలను కట్టి భక్తులు తమ మొక్కులను చెల్లించుకుంటారు. జాతర సమయంలో నైవేద్యాలు, బోనాలు సమర్పిస్తారు. సంత మల్లన్న సిడి వద్ద మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం.

Must Read
Related News