అక్షరటుడే, బాన్సువాడ: Sankranthi Special | సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుడికి అత్తామామలు గుర్తుండిపోయే విందు ఇచ్చారు. 150 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిలిచారు.
సత్యనారాయణపురంలో..
వర్ని(Varni) మండల కేంద్రంలోని సత్యనారాయణపురంలో (Satyanarayana Puram) లక్ష్మిరాంబాబు దంపతులు తమ కుమార్తెకు రెండు నెలల క్రితం వివాహం జరిపించారు. సంక్రాంతికి కొత్త అల్లుడిని భోజనానికి ఇంటికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పండుగకు తొలిసారి ఇంటికి వచ్చిన అల్లుడిని ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఏకంగా 150 రకాల తీపి, పిండి వంటలను సిద్ధం చేశారు. పెద్ద అరటి ఆకులో అన్ని వంటకాలను వడ్డించి, కుటుంబ సభ్యులతో కలిసి అల్లుడికి ప్రత్యేక విందు ఇచ్చారు. ఈ వినూత్న విందు స్థానికంగా అందరిని ఆకట్టుకుంది.