BJYM Nizamabad | సంక్రాంతి అంటేనే పంతగుల సంబరం..

అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | సంక్రాంతి పండుగ (Sankranthi festival ) అంటేనే పతంగుల సంబరమని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్​ అన్నారు. ఆదివారం 25వ డివిజన్​లో చిన్నారులకు ఉచితంగా పతంగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలని (Hindu festivals) అన్నారు. రైతులందరు సంతోషంగా భోగి, సంక్రాతి, కనుమగా మూడు రోజుల పండుగను నిర్వహించుకుంటారన్నారు. చిన్న, పెద్దా అంతా కలిసి సంబరం […]

అక్షరటుడే, ఇందూరు: BJYM Nizamabad | సంక్రాంతి పండుగ (Sankranthi festival ) అంటేనే పతంగుల సంబరమని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్నాటి కార్తీక్​ అన్నారు. ఆదివారం 25వ డివిజన్​లో చిన్నారులకు ఉచితంగా పతంగులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలని (Hindu festivals) అన్నారు. రైతులందరు సంతోషంగా భోగి, సంక్రాతి, కనుమగా మూడు రోజుల పండుగను నిర్వహించుకుంటారన్నారు. చిన్న, పెద్దా అంతా కలిసి సంబరం చేసుకోవడం అనాదిగా వస్తోందన్నారు.

BJYM Nizamabad | ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు

ముఖ్యంగా పతంగులు ఎగరేసే క్రమంలో చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగలు, రహదారులు, ఎత్తైన భవనాల సమీపంలో పతంగులు ఎగరేయకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రమాదాలకు దారితీసే చైనా మాంజా వాడకాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. భద్రతే ప్రధాన లక్ష్యంగా పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు జగదీష్, నిరంజన్, దినేష్, రాకేష్, నాని పాల్గొన్నారు.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...