44
అక్షరటుడే, ఇందూరు : JCI Indur | జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ (జేసీఐ) ఇందూర్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. స్థానిక ఇంద్రాపూర్ కాలనీలో (Indrapur Colony) మహిళలకు ముగ్గుల పోటీలు (Rangoli Competitions) నిర్వహించారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
JCI Indur | చిన్నారులకు గాలిపటాల పంపిణీ..
అనంతరం కాలనీకి చెందిన పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ కాలె, తిరునగరి మనస్విని, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, ప్రోగ్రామ్ ఛైర్మన్ కోడూరు శ్రీనివాస్, జేఏసీ అలుమ్ని క్లబ్ రీజియన్ ఛైర్మన్ జిల్కర్ లావణ్య, పూర్వాధ్యక్షుడు చింతల గంగాదాస్, తిరునగరి శ్రీహరి, జేసీఐ ప్రతినిధులు నిపుణ్, సునీత, వెన్నెల, మృణాళిని, అక్షిత, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.