అక్షరటుడే, బాన్సువాడ : Sammakka Sarakka Jathara | మేడారం (Medaram) వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ కార్గో ద్వారా కేవలం రూ.299కే మేడారం సమ్మక్క–సారక్క బంగారం ప్రసాదాన్ని ఇంటి వద్దకే అందిస్తామని బాన్సువాడ డిపో మేనేజర్ (Banswada Depot Manager) రవి కుమార్ తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని డిపో కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు.
Sammakka Sarakka Jathara | వెబ్‌సైట్ ద్వారా కూడా..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులు www.logistics.co.in వెబ్‌సైట్ ద్వారా లేదా సమీపంలోని ఆర్టీసీ కార్గో కౌంటర్ల (RTC Cargo Counters) వద్ద బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఈ ప్యాకేజీలో బంగారం (బెల్లం), పసుపు, కుంకుమతో పాటు అమ్మవార్ల ఫొటో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది సీనియర్ అసిస్టెంట్ ఇస్తారి, పంకజ్, విశ్వేశ్వర్, ఇర్ఫాన్, అలాగే బాన్సువాడ డిపో కార్గో డీఎంఈ కిశోర్ పాల్గొన్నారు.