అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Samantha Marriage | నటి సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. చిత్రనిర్మాత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ఈ ప్రైవేట్ వేడుక ఈ ఉదయం ఇషా యోగా సెంటర్‌లో (Linga Bhairavi Temple)లో జరిగింది. దాదాపు 30 మంది అతిథులు ఈ వేడుకకు హాజరైనట్లు సమాచారం.
ఇటీవలి నెలల్లో ఈ జంట తరచుగా కలిసి కనిపించడం వల్ల వారు కేవలం సహకారులు మాత్రమే కాదని ఊహాగానాలకు వచ్చాయి. ఇటీవల ముంబైలోని ఒక కార్యక్రమంలో రాజ్‌తో కలిసి ఉన్న ఫొటోను సమంత సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది. అది త్వరగా వైరల్ అయింది. చిత్రంలో, సమంత రాజ్‌ను కౌగిలించుకోవడం కనిపించింది. దీంతో వారు డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. దీనిపై వారు అధికారికంగా ఎప్పుడు స్పందించలేదు. అయితే తాజాగా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
సమంత, రాజ్ వృత్తిపరంగా కూడా జతకడుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన మా ఇంటి బంగారం అనే తెలుగు చిత్రాన్ని ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యాక్షన్ అడ్వెంచర్ అని తెలిసింది. సమంత కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
Samantha Marriage | చాలా కాలంగా డేటింగ్
సమంత గతంలో అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకుంది. అనంతరం వారికి విడాకులు అయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న సమంత తర్వాత అనారోగ్యానికి గురైంది. అనంతరం నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో ప్రేమలో పడింది. వీరు చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు డిసెంబర్ 1న పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు అవి నిజం అయ్యాయి.
Samantha Marriage | యోగా సెంటర్‌లో..
తమిళనాడు (Tamil Nadu)లోని ఇషా యోగా సెంటర్లోని లింగా భైరవి ఆలయంలో సమంత పెళ్లి జరిగింది. రాజ్ మాజీ భార్య శ్యామలి డే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ” తెగించిన వాళ్లు తెగించిన పనులే చేస్తారు” అనే అర్థం వచ్చేలా ఒక పోస్ట్ పెట్టారు.
