Salim Khan | గొడ్డు మాంసం తినం.. అన్ని మతాలని గౌర‌విస్తామంటూ స‌ల్మాన్ తండ్రి కామెంట్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Salim Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ తన కుటుంబ జీవనశైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆహార‌పు అల‌వాట్లు, మ‌త సామరస్యం తదితర అంశాలపై భిన్న‌ అభిప్రాయాలను వెల్లడించారు. స‌లీం ఖాన్ (Salim Khan) మాట్లాడుతూ.. మేము ముస్లింలమే అయినా, మా ఇంట్లో గొడ్డు మాంసం ఎప్పుడూ తినలేదు. ఇండోర్ నుంచి ముంబయికి వచ్చిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Salim Khan | బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తండ్రి, ప్రముఖ సినీ రచయిత సలీం ఖాన్ తన కుటుంబ జీవనశైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, ఆహార‌పు అల‌వాట్లు, మ‌త సామరస్యం తదితర అంశాలపై భిన్న‌ అభిప్రాయాలను వెల్లడించారు.

స‌లీం ఖాన్ (Salim Khan) మాట్లాడుతూ.. మేము ముస్లింలమే అయినా, మా ఇంట్లో గొడ్డు మాంసం ఎప్పుడూ తినలేదు. ఇండోర్ నుంచి ముంబయికి వచ్చిన తర్వాతా అదే పద్ధతి కొనసాగుతోంది,” అని అన్నారు. “బీఫ్ తినడం మా కుటుంబంలో పూర్తిగా నిషిద్ధం. మేము అలా పెరిగాం. గొర్రె మాంసం, చికెన్ (mutton and chicken) తిన్నాము కానీ బీఫ్‌కు మాత్రం ఎప్పుడూ దూరంగా ఉన్నాం అని చెప్పారు.

Salman Khan | ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

మహమ్మద్ ప్రవక్త బోధనల ప్రకారం, ఆవు పాలు (Cow Milk) తల్లి పాలతో సమానం. అందుకే ఆవును గౌరవిస్తాం. అదే కారణంగా బీఫ్‌కి దూరంగా ఉంటాం,” అని స్పష్టం చేశారు స‌లీం ఖాన్. అయితే, ఆహార విషయంలో ఎవరి ఇష్టం వాళ్లది. ఎవరు ఏది తినాలనుకుంటే, అది వారి స్వేచ్ఛ,” అని త‌న అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ, మా వీధిలో హిందూ పండుగలు (Hindhu Festivals) చాలా ఘనంగా జరుపుకునేవారు. మేమూ వాటిలో పాల్గొనేవాళ్లం. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ ఉత్సవాల్లో భాగమయ్యేవారు,” అని అన్నారు.తన భార్య సుశీలను వివాహం చేసుకున్న సమయంలో కూడా కుటుంబంలో ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని తెలిపారు.

దీని వల్ల మా కుటుంబం అన్ని పండుగలను జరుపుకుంటూ , అన్ని సంప్రదాయాలను గౌర‌విస్తూ వ‌స్తున్నాం అని స్ప‌ష్టం చేశారు. ప్రతి సంవత్సరం లాగే, ఈసారి కూడా ఇంట్లో గణపతిని ప్రతిష్టించి పూజలు చేశాం. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఈ భావన వల్లే మా కుటుంబం సఖ్యతగా, సంతోషంగా 60 ఏళ్లు కలిసి జీవిస్తోంది,” అని చెప్పారు. మొత్తంగా, సలీం ఖాన్ (Saleem Khan) వ్యాఖ్యలు భారతదేశం వంటి బహుళ మత సామరస్య దేశంలో సహన శీలత, పరస్పర గౌరవం, సంప్రదాయాల సమ్మిళిత జీవనవిధానంకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...