GP Workers | పంచాయతీ కార్మికులకు శుభవార్త.. జీతాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో జీపీ కార్మికులు(GP Workers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ఇటీవల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్​ వర్కర్లకు(Multi Purpose Workers) వేతనాలు విడుదల చేసింది. రాష్ట్రంలో పని చేసే […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో జీపీ కార్మికులు(GP Workers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ఇటీవల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్​ వర్కర్లకు(Multi Purpose Workers) వేతనాలు విడుదల చేసింది.

రాష్ట్రంలో పని చేసే పంచాయతీ కార్మికులకు గతంలో పంచాయతీ ఖాతాల నుంచి జీతాలు చెల్లించేవారు. దీంతో జీపీలకు వచ్చే నిధులలో నుంచి కార్మికులకు జీతాలు ఇచ్చేవారు. లేదంటే సర్పంచులు సొంతంగా నెలనెలా జీతాలు ఇచ్చి తర్వాత నిధులు విడుదలైనప్పుడు తీసుకునే వారు. అయితే 16 నెలలుగా పల్లెల్లో పాలక వర్గాలు లేవు. అంతేగాకుండా ప్రభుత్వం నేరుగా జీపీ కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తోంది. అయితే ప్రతినెలా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

GP Workers | రూ.150 కోట్లు విడుదల

పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్​ కార్మికుల వేతనాల కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు (Finance Department Orders) జారీ చేసింది. ఏప్రిల్​, మే, జూన్​ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఈ నిధులను కేటాయించింది. ఈ మేరకు నిధులు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి నెలా తమకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే.. మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...