అక్షరటుడే, బిచ్కుంద: Salabatpur Temple | మద్నూర్ మండలంలోని సలాబత్ పూర్ హనుమాన్ ఆలయ (Hanuman Temple) హుండీని గురువారం లెక్కించారు. ఆలయ ఛైర్మన్ రాంపటేల్, సిబ్బంది(Temple staff) ఆధ్వర్యంలో లెక్కింపు చేపట్టారు. హుండీ ద్వారా రూ.5,09,370 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రామారావు, ఆలయ ఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
