103
అక్షరటుడే, ఇందూరు: Taekwondo competitions | జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు (national-level Taekwondo competitions) జిల్లా క్రీడాకారిణి సాయి ప్రసన్న ఎంపికైనట్లు నిజామాబాద్ అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ (Nizamabad Amateur Taekwondo Association) ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు.
తైక్వాండో సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం (gold medal) సాధించిందని వివరించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఈనెల 13వ తేదీ నుంచి 15వరకు జరిగే జాతీయస్థాయి టోర్నీలో పాల్గొనుందన్నారు. ఈ మేరకు జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య క్రీడాకారిణికి అభినందనలు తెలిపారు.