Homeజిల్లాలునిజామాబాద్​BC Sankshema Sangham | సాయి ఈశ్వర చారి బలిదానం వృథాగా పోదు..

BC Sankshema Sangham | సాయి ఈశ్వర చారి బలిదానం వృథాగా పోదు..

బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన విశ్వకర్మ బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారి బలిదానం వృథాగా పోదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పేర్కొన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు : BC Sankshema Sangham | బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన విశ్వకర్మ బీసీ బిడ్డ సాయి ఈశ్వర చారి బలిదానం వృథాగా పోదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ (Nara Sudhakar) అన్నారు. సాయి ఈశ్వర చారి మృతి పట్ల నగరంలోని హనుమాన్ జంక్షన్ విగ్రహాల పార్కులో పూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

52శాతం ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇవ్వాలని చూస్తే.. అగ్రవర్ణాల దురహంకారులు కేసులు వేసి మోకాలడ్డు పెట్టడం సమంజసం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ మోసాన్ని తట్టుకోలేని సాయి ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలిచి వేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీసీలే సింహభాగం ఆత్మార్పణ చేసుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ఈసారి ఆత్మ బలిదానాలు ఉండవని బీసీల తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని నరాల సుధాకర్​ హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి షెడ్యూల్ 9లో రిజర్వేషన్లను పొందుపర్చి బీసీలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ, ఇప్పటి బీసీ ఉద్యమంలో మొదటగా ఆత్మార్పణ చేసింది విశ్వబ్రాహ్మణులేనని.. నాటి తెలంగాణ స్ఫూర్తితో నేటి బీసీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సత్య ప్రకాష్ (Satya Prakash) అన్నారు. ప్రభుత్వాలు దిగివచ్చి మేమెంతో మాకెంత వాటా ఇచ్చేవరకు బీసీ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ అన్నారు. కార్యక్రమంలో నాయకులు కొయ్యాడ శంకర్, కరిపె రవీందర్, సత్య ప్రకాష్, బగ్గలి అజయ్, శ్రీనివాస్, చంద్రకాంత్, సదానంద్, సురేందర్, గంగాధర్, గోపాలకృష్ణ, నగేష్, దయానంద్, వెంకటేష్, లక్ష్మణాచారి, మురళి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News