అక్షరటుడే, కోటగిరి : Bathukamma | పోతంగల్ మండల (Pothangal mandal) కేంద్రంలో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఉదయం నుంచే రంగురంగుల పూలతో బతుకమ్మలను (Bathukamma) అందంగా పేర్చారు.
అనంతరం బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాట, కోలాటాలతో వీధుల్లో, ప్రధాన కూడళ్లలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి (Telangana culture and tradition) ప్రతీక అన్నారు. ప్రకృతిని పూజించే పూలపండుగ, అని మహిళలకు ప్రత్యేకమైందన్నారు. పార్వతి దేవిని (గౌరీదేవి) కొలుస్తామన్నారు. అనంతరం స్థానిక చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
