ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్రంలో అన్నదాతల (Farmers) పెట్టుబడి సాయం కింద రైతు భరోసా (Rythu Bharosa) జమ కొనసాగుతోంది. వానాకాలం సాగు సీజన్​కు సంబంధించి రైతు భరోసా నిధుల విడుదలను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) సోమవారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

    తొలి రోజు రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. రెండో రోజు మూడు ఎకరాల్లో భూమి ఉన్న అన్నదాతలకు డబ్బులు వేసింది. తాజాగా బుధవారం నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు.

    నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు రైతుభరోసా నిధులు జమ కోసం ప్రభుత్వం మరో రూ.1,313.53 కోట్లు విడుదల చేసింది. 21.89 లక్షల ఎకరాలకు సంబంధించి 6.33 లక్షల మంది రైతుల ఖాతాల్లో బుధవారం డబ్బులు జమ చేసినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఇప్పటి వరకు 58.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.5215.26 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈ సీజన్​లో రైతుభరోసా కింద రూ.9 వేల కోట్లు తొమ్మిది రోజుల్లో జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.

    Rythu Bharosa | వారికి ప్రశ్నించే హక్కు లేదు

    రైతు భరోసా విషయంతో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్​ (BRS leaders) నాయకులకు లేదని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి మినహా ఎప్పుడు కూడా సకాలంలో రైతుబంధు (Rythu Bandhu) విడుదల చేయలేదని ఆయన విమర్శించారు. ప్రతిసారి ఆలస్యంగా డబ్బులు జమ చేసేవారన్నారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం సాగు పనులు మొదలు కాకముందే అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా జమ చేస్తున్నట్లు తెలిపారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...