HomeజాతీయంPutin Visit | భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఘన స్వాగతం పలికిన మోదీ

Putin Visit | భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. ఘన స్వాగతం పలికిన మోదీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ భారత్​కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఆయనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

అక్షరటుడే వెబ్​డెస్క్ : Putin Visit | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ (Russian President Vladimir Putin) భారత్​కు చేరుకున్నారు. గురువారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని పాలెం విమానాశ్రమయంలో ల్యాండ్​ అయ్యారు. పుతిన్​కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఘన స్వాగతం పలికారు.

పుతిన్​ నాలుగేళ్ల అనంతరం ఆయన మళ్లీ ఢిల్లీకి వచ్చారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం (Russia-Ukraine war) ప్రారంభమైన తర్వాత భారత్​లో పర్యటించడం ఇదే మొదటి సారి. ఇండియా-రష్యా 23వ వార్షిక శిఖరాగ్ర భేటీలో భాగంగా ప్రధాని మోదీతో పుతిన్​ సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు భారత్​లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు, సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. పరిశ్రమలు, ఇంధనం, అంతరిక్షం, వ్యవసాయం తదితర రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడమే లక్ష్యంగా చర్యలు తీసుకోనున్నాయి.

Putin Visit | 8 మంది మంత్రులతో..

పాలం ఎయిర్‌పోర్టులో (Palam airport) పుతిన్‌కు మోదీ ఘన స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి మోదీ స్వాగతం పలకడం గమనార్హం. పుతిన్‌కు మోదీ ప్రత్యేకంగా విందు ఇవ్వనున్నారు. 26 గంటల పాటు ఆయన భారత్​లో ఉండనున్నారు. 8 మంది మంత్రుల బృందంతో భారత్‌కు వచ్చారు. శుక్రవారం అధికారిక చర్చలు ప్రారంభమయ్యే ముందు ఆయనకు సంప్రాదాయ స్వాగతం లభిస్తుంది. చర్చల తర్వాత, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ మీడియాకు ఒక ప్రకటన చేస్తారు. శుక్రవారం మహాత్మా గాంధీ స్మారక చిహ్నం వద్ద పుతిన్ నివాళి అర్పించనున్నారు.

Must Read
Related News