Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Rural Mla | ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన రూరల్​ ఎమ్మెల్యే

Nizamabad Rural Mla | ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన రూరల్​ ఎమ్మెల్యే

సిరికొండ మండలంలోని తూంపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తనిఖీ చేశారు. పాఠశాలలో పరిస్థితులను తెలుసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Nizamabad Rural Mla | సిరికొండ మండలంలోని (Sirikonda mandal) తూంపల్లి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి (MLA Dr. Bhupathi Reddy) శనివారం తనిఖీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే యూకేజీ పిల్లలను గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు నిర్ణయించారు. అయితే చిన్నారులు నేలమీద కూర్చోని చదువుకుంటున్నారు.

అయితే పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. డీఈవో అశోక్​తో (DEO Ashok) ఫోన్​లో మాట్లాడారు. గ్రామస్థులంతా ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారని.. ఇందుకు తగ్గట్టుగా విద్యార్థుల కోసం తరగతి గదులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్​ సిరికొండ మండలాధ్యక్షుడు బాకారం రవి, డీసీసీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి, నాయకుడు ఎర్రన్న, నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులున్నారు.

Must Read
Related News