అక్షరటుడే, ఇందూరు: Nizamabad RTC | దసరా (Dussehra) పండుగ ఆర్టీసీకి లాభాల పంట పండించింది. ప్రజలు బస్సుల్లో ఎక్కువ సంఖ్యలో ప్రయాణించడంతో సంస్థ లక్ష్యానికి మించి లాభాలను సాధించింది. రాష్ట్రంలోనే నిజామాబాద్ రీజియన్ ఉత్తమ ప్రగతిని సాధించి రికార్డు ఆదాయాన్ని ఆర్జించింది.
Nizamabad RTC | రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిజామాబాద్
రాష్ట్ర ఆదాయంలో నిజామాబాద్ (Nizamabad) రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. రోడ్డు రవాణా సంస్థ అన్ని రీజియన్లకు రూ.18 కోట్లు లక్ష్యాన్ని విధించగా, రూ.19.53 కోట్లు వసూలు చేసి ప్రగతిని సాధించింది. అలాగే నిజామాబాద్ రీజియన్ టార్గెట్ రూ.1.17 కోట్లు కాగా, రూ.1.19 కోట్లు సాధించింది. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ కావడం, బతుకమ్మకు (Bathukamma) మహిళలు అధికంగా ప్రయాణించడం ఇందుకు దోహదపడ్డాయి. ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో గతం కంటే ఈసారి ప్రయాణాలు ఎక్కువగానే సాగాయి.
Nizamabad RTC | ప్రత్యేక ప్రణాళికతో..
దసరా రద్దీని దృష్టిలో పెట్టుకొని రీజనల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పీవో పద్మజ తదితరులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. గత నెల 26 నుంచి ఈనెల 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను (special buses) ఏర్పాటు చేశారు. ప్రధానంగా నిజామాబాద్ రీజియన్లోని అన్ని డిపోల నుంచి హైదరాబాద్కు (Hyderabad), ఇతర జిల్లాలు, గ్రామాలకు 566 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకున్నారు.
Nizamabad RTC | డిపోల వారీగా ఆదాయం (రూ.లక్షల్లో )
డిపో లక్ష్యం(రూ.లక్షలు) సాధన (రూ.లక్షలు)
ఆర్మూర్ రూ.13.98 రూ.17.30
బోధన్ రూ.21.23 రూ.22.25
నిజామాబాద్ -1 రూ.21.10 రూ.24.26
నిజామాబాద్ -2 రూ.29.25 రూ.24.61
బాన్సువాడ రూ.11.59 రూ.12.55
కామారెడ్డి రూ.19.86 రూ.18.13
