అక్షరటుడే, బాన్సువాడ: shabarimala | శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బాన్సువాడ ఆర్టీసీ డిపో (Banswada RTC depot) శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ మేరకు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ వి.రవికుమార్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వాములతో కలిసి ఆర్టీసీ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. శబరిమల యాత్రకు (Sabarimala Yatra) వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు మల్లికార్జున స్వామి, నరసింహ స్వామి, ఆర్టీసీ సిబ్బంది బసంత్, పండరి, చందర్ తదితరులు పాల్గొన్నారు.
