RTC Bus | కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళ దుర్మరణం

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: RTC Bus | ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్​ (Makloor) మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్​ ఎస్సై రాజశేఖర్ (Makloor SI Rajasekhar)​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) నుంచి వరంగల్(Warangal) వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్​నగర్​ (Das nagar) వద్ద ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో […]

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: RTC Bus | ఆర్టీసీ బస్సు కారును ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మాక్లూర్​ (Makloor) మండల శివారులో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మాక్లూర్​ ఎస్సై రాజశేఖర్ (Makloor SI Rajasekhar)​ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ (Nizamabad) నుంచి వరంగల్(Warangal) వైపు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్​ బస్సు మాక్లూర్ నుంచి నిజామాబాద్ వస్తున్న కారును దాస్​నగర్​ (Das nagar) వద్ద ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న మాక్లూర్​ మండల కేంద్రానికి చెందిన షేక్ మహమ్మదీ (52) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మహమ్మదీ కొడుకు, కోడలు, కూతురికి గాయాలయ్యాయి. వీరిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ అజాగ్రత్తగా బస్సు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త షేక్ బషీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...