అక్షరటుడే, కమ్మర్పల్లి : RSS | కమ్మర్పల్లి (Kammarpalli) మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి (Vijaya Dasami) ఉత్సవం ఘనంగా నిర్వహించారు. సంఘ్‌ను స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్ఎస్ఎస్ విభాగ్ సహకార్య వహ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సంఘం స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా అన్ని గ్రామాల్లో శాఖలు నిర్వహించాలని సూచించారు. హిందువులలో ఐక్యత పెరిగినప్పుడే దేశ అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ రాజశేఖర్, కిషన్ గౌడ్, మరియాల నాగభూషణం, నరేష్, గణేష్ గుప్తా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.