అక్షరటుడే, కోటగిరి: RSS | మండల కేంద్రంలో (Kotagiri) రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (Rashtriya Swayamsevak Sangh) శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానికంగా చావిడి గల్లీలోని మున్నూరుకాపు సంఘంలో ఆదివారం పురోహితులు రాజు మహారాజ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 1925లో విజయదశమి (Vijayadashami) రోజున హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘాన్ని ప్రారంభించారన్నారు. ప్రజలకు సేవచేస్తూ, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఆర్ఎస్ఎస్ కృషి చేస్తోందన్నారు.
కార్యక్రమంలో విభాగ్ పర్యావరణ ప్రముఖ్ రామ్ నరేష్, గ్రామ పెద్దలు పత్తి లక్ష్మణ్, కూచి సిద్దు, ఏముల నవీన్, సాయిబాబా గౌడ్, శీను, రమేష్, శ్యామ్, సాయి ప్రసాద్, రాజు, సతీష్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామస్థులు పాల్గొన్నారు.