IRS officer’s illegal assets | ఐఆర్​ఎస్​ అధికారి భారీ అక్రమాస్తుల చిట్టా​.. రూ.కోట్లలో నగదు, భారీగా బంగారం

అక్షరటుడే, న్యూఢిల్లీ: IRS officer’s illegal assets : 2007 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IRS (ఇన్‌కమ్ ట్యాక్స్) అధికారి senior IRS (Income Tax) officer ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation – CBI) సోదాలు చేపట్టి, భారీ మొత్తంలో అక్రమ ఆస్తులను వెలికితీసింది. ప్రస్తుతం ఢిల్లీ(Delhi) ITO, CR బిల్డింగ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ (Directorate of Taxpayer Services)లో అదనపు డైరెక్టర్ జనరల్ (Additional […]

అక్షరటుడే, న్యూఢిల్లీ: IRS officer’s illegal assets : 2007 బ్యాచ్‌కు చెందిన సీనియర్ IRS (ఇన్‌కమ్ ట్యాక్స్) అధికారి senior IRS (Income Tax) officer ఇంట్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (Central Bureau of Investigation – CBI) సోదాలు చేపట్టి, భారీ మొత్తంలో అక్రమ ఆస్తులను వెలికితీసింది.

ప్రస్తుతం ఢిల్లీ(Delhi) ITO, CR బిల్డింగ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ (Directorate of Taxpayer Services)లో అదనపు డైరెక్టర్ జనరల్ (Additional Director General)గా పనిచేస్తున్న ఈ అధికారి సహా మరో వ్యక్తిని CBI ఇప్పటికే అరెస్టు చేసింది. కాగా.. అధికారి పేరు, వివరాలు మాత్రం బయటపెట్టలేదు.

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని పలు ప్రదేశాల్లో ఈ దాడులు సమాంతరంగా జరిగాయి. అధికారి నివాసాలు, బంధువుల ఇళ్ళు, కార్యాలయాల వంటి ప్రదేశాల్లో సోదాలు చేపట్టారు. అవినీతి కొండ నుంచి 3.5 కేజీల గోల్డ్, 2 కేజీల సిల్వర్, రూ.కోటి నగదుతో పాటు ఇతర కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాల (లాప్‌టాప్‌లు, మొబైల్స్)ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

CBIకి అందిన ఫిర్యాదు నేపథ్యంలో సోదాలు చేపట్టగా.. పన్ను సంబంధిత సేవలకు సంబంధించి లంచాల డిమాండ్, అవినీతి ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరినీ అరెస్టు చేసి, వారి సంబంధిత ప్రదేశాల్లో దాడులు చేపట్టారు. సోదాల్లో అధికారి వద్ద ఈ స్థాయిలో నగదు, విలువైన వస్తువులు బయటపడటం అందరినీ షాక్‌కు గురిచేసింది.

సీబీఐ ఇప్పటికే అరెస్టు అయిన ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కోరనుంది. మొత్తం ఆస్తులు, అక్రమ లావాదేవీల ట్రేసింగ్ కోసం బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల పత్రాలు తదితర ఆధారాలు సేకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన అవినీతి నిరోధక శక్తులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించేలా చేసింది. ఆదాయపన్ను శాఖలో ఉన్నతస్థాయి అధికారిపై ఈ స్థాయిలో చర్యలు తీసుకోవడం గతంలో లేనట్లుగా తెలుస్తోంది. CBI మరింత లోతుగా విచారణ చేపట్టి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...

Kalyan Jeweller: రంగుల పండుగ కోసం కల్యాణ్ జువెలర్స్ ప్రత్యేక కానుక.. ‘ది క్యూరేటెడ్ హోలీ ఎడిట్’ విడుదల

హైదరాబాద్: దేశీయ ప్రముఖ ఆభరణాల సంస్థ కల్యాణ్ జువెలర్స్, హోలీ పండుగ సంబరాలను పురస్కరించుకుని సరికొత్త ఆభరణాల శ్రేణి 'కలర్‌ఫుల్ స్టేట్‌మెంట్స్: ది క్యూరేటెడ్...