Homeక్రైంHyderabad | డబ్బులు డబుల్​ అవుతాయని చెప్పి.. రూ.500 కోట్ల మోసం!

Hyderabad | డబ్బులు డబుల్​ అవుతాయని చెప్పి.. రూ.500 కోట్ల మోసం!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | హైదరాబాద్​లోని మాదాపూర్​ (Madhapur)లో భారీ మోసం వెలుగు చూసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్​ అవుతాయని నమ్మించిన ఓ సంస్థ ప్రజల నుంచి రూ.500 కోట్లు వసూలు చేసింది. మాదాపూర్​లోని ఏవీ ఇన్ఫ్రాకాన్ (AV Infracon)  ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బైబ్యాక్‌ పేరుతో రూ.500 కోట్ల మోసానికి పాల్పడింది.

తమ కంపెనీలో పెట్టుబడి పెడితే డబుల్​ ఇస్తామని సంస్థ యజమాని విజయ్​ గొగుల ప్రజలను నమ్మించారు. డబ్బులు ఇవ్వకపోతే తగిన భూమి రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చాలా మంది ఆ సంస్థలో పెట్టుబడి పెట్టారు. సుమారు 500 మంది నుంచి రూ.500 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎంతకు డబ్బులు రిటర్న్​ ఇవ్వకపోవడంతో బాధితులు ఆయనను ప్రశ్నించారు. దీంతో మరో ప్రాజెక్ట్​ ఉందంటూ నమ్మించాడు.

బాధితులు గట్టిగా ప్రశ్నిస్తే బ్లాంక్ చెక్కులు ఇస్తూ తప్పించుకొని తిరుగుతున్నాడు. దీంతో బాధితులు సైబరాబాద్ (Cyberabad)​ కమిషనరేట్​లో, మాదాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు మాదాపూర్​ పోలీసులు తెలిపారు.