Homeజిల్లాలుకామారెడ్డిMinister Seethakka | గ్రామీణ అభివృద్ధికి రూ.2,750 కోట్లు: జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

Minister Seethakka | గ్రామీణ అభివృద్ధికి రూ.2,750 కోట్లు: జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క

జిల్లాలో గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. భిక్కనూరు, కామారెడ్డి పట్టణాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | జిల్లాలో గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క (District in-charge Minister Seethakka) పేర్కొన్నారు. భిక్కనూరు, కామారెడ్డి పట్టణాల్లో (Kamareddy town) పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశువుల కొట్టాలు, కంపోస్ట్ గుంతలు, అంగన్‌వాడీ కేంద్రాలు (Anganwadi centers), సీసీ రోడ్లు లాంటి వాటికి సుమారు రూ.2,750 కోట్లతో పనులను ప్రారంభిస్తున్నామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క ప్రకటించారు.

భిక్కనూరు మార్కెట్ యార్డులో రూ.92.80 లక్షల వ్యయంతో పలు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండల కేంద్రంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) రూ.9 కోట్లతో చేపట్టబోయే ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేశారు. ఇల్చిపూర్ శివారులో వృద్ధాశ్రమం కోసం రూ.1.53 కోట్లు మంజూరు కాగా రూ.96 లక్షల పనులకు ప్రారంభోత్సవం చేశారు.

కామారెడ్డి మార్కెట్ యార్డులో పలు పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అప్పుల్లో ఉన్నా పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందన్నారు.

మహిళా సంక్షేమం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం అందిస్తున్నామని జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళలను ఆర్థికంగా సాధికార పరచడానికి వివిధ వ్యాపార అవకాశాలు కల్పించడం వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma House Scheme) కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ హామీని అమలు చేసామన్నారు.

Minister Seethakka | గ్రంథాలయాలు విజ్ఞాన భాండగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలని మంత్రి సీతక్క అన్నారు. గ్రంథాలయాల్లో చదువుకున్న ఎంతో మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం 75 వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. అందులో ఎక్కువశాతం గ్రంథాలయాల్లో చదువుకున్న వారికే వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు నోటిఫికేషన్ ఇవ్వడం, రద్దు కావడం జరిగిందని, ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలో అన్ని నోటిఫికేషన్లు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు.

రానున్న రోజుల్లో 15వేల అంగన్వాడి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యమాలలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), మార్కెట్ కమిటీ ఛైర్మన్లు పాత రాజు, లక్ష్మి, గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.