Jeedimetla | స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరిట రూ.150 కోట్ల మోసం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeedimetla | ఆశ మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని కలలు కంటున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్​ నేరగాళ్ల (Cyber Criminals) నుంచి మొదలు పెడితే మల్టీ లెవల్​ మార్కెటింగ్ (MLM)​ కంపెనీలు, ఇతర నకిలీ కంపెనీలు పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. నిత్యం […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jeedimetla | ఆశ మనిషిని జీవితంలో ముందుకు నడిపిస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది.

ప్రస్తుత రోజుల్లో ప్రజలు తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలని కలలు కంటున్నారు. వీరినే లక్ష్యంగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్​ నేరగాళ్ల (Cyber Criminals) నుంచి మొదలు పెడితే మల్టీ లెవల్​ మార్కెటింగ్ (MLM)​ కంపెనీలు, ఇతర నకిలీ కంపెనీలు పెట్టి తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు.

నిత్యం ఇలాంటి మోసాలు జరుగుతున్నా.. ఇంకా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా స్టాక్​మార్కెట్​ (Stock Market)లో పెట్టుబడుల (Investment) పేరిట ఓ సంస్థ మోసానికి పాల్పడింది. పలువురు అమాయకులను ఏకంగా రూ.150 కోట్ల మోసగించింది. ఈ ఘటన రాష్ట్రంలో చర్చకు దారితీసింది.

జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​ (Jeedimetla Police Station) పరిధిలోని చింతల్‌ గణేశ్‌నగర్‌లో ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ (The Penguin Securities) పేరుతో ఓ సంస్థ వెలిసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. వీరి మాయ మాటలు నమ్మి దాదాపు 1,500 మంది రూ.150 కోట్ల మేర ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇన్వెస్ట్​ చేసిన వారికి నమ్మకం కలిగించేలా వారికి బాండ్లు కూడా అందజేశారు.

తీరా ఈ మధ్య కార్యకలాపాలు ఆపేశారు. ఎవరితో టచ్ లో లేకుండా సంస్థ యాజమాన్యం ఉదయించింది. ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు శుక్రవారం జీడిమెట్ల పోలీస్​ స్టేషన్​కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...