Telangana Police | పోలీస్​ వాహనాల స్టిక్కర్ల కోసం రూ.1.60 కోట్లు ఖర్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Police | హైదరాబాద్ (Hyderabad)​ నగర పోలీస్​ వాహనాలపై స్టిక్కర్లను అధికారులు మారుస్తున్నారు. బీఆర్​ఎస్​ (BRS) హయాంలో పోలీస్​ వాహనాలపై తెలంగాణ స్టేట్​ పోలీస్​ అని ఉండేది. ప్రస్తుతం తెలంగాణ పోలీస్​ అనే స్టిక్కర్లను అతికించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక టీఎస్ (TS)​ బదులు టీజీ (TG) అని వాడాలని ఆదేశాలు జారీ చేసింది. వాహనాల నంబర్​ ప్లేట్లపై కూడా గతంలో టీఎస్​ అని ఉండగా.. ఇప్పుడు టీజీ వస్తుంది. బీఆర్​ఎస్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Police | హైదరాబాద్ (Hyderabad)​ నగర పోలీస్​ వాహనాలపై స్టిక్కర్లను అధికారులు మారుస్తున్నారు.

బీఆర్​ఎస్​ (BRS) హయాంలో పోలీస్​ వాహనాలపై తెలంగాణ స్టేట్​ పోలీస్​ అని ఉండేది. ప్రస్తుతం తెలంగాణ పోలీస్​ అనే స్టిక్కర్లను అతికించారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక టీఎస్ (TS)​ బదులు టీజీ (TG) అని వాడాలని ఆదేశాలు జారీ చేసింది. వాహనాల నంబర్​ ప్లేట్లపై కూడా గతంలో టీఎస్​ అని ఉండగా.. ఇప్పుడు టీజీ వస్తుంది. బీఆర్​ఎస్​ హయాంలో టీఎస్​ అంటే తెలంగాణ స్టేట్​ అని పేర్కొన్నారు. అయితే టీఎస్​ అని పెట్టడంపై గతంలో విమర్శలు వచ్చాయి. టీఆర్​ఎస్​ను సూచించే విధంగా టీఎస్​ అని పెట్టారని పలువురు ఆరోపించారు. ఈ క్రమంలో కాంగ్రెస్​  అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy ) టీజీ అనే ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు పోలీస్​ వాహనాల స్టిక్కర్లను సైతం మారుస్తున్నారు.

Telangana Police | 188 వాహనాల కోసం..

హైదరాబాద్​ సిటీ పోలీసుల (City Police) పరిధిలో మొత్తం 188 వాహనాలకు కొత్త స్టిక్కర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం పోలీసులు ఇన్నోవా కార్లను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. వాటికి కొత్త స్టిక్కర్లు వేయడంతో పాటు పాలిషింగ్​, డెంటింగ్​, పెయింటింగ్​ చేయిస్తున్నారు. దీని కోసం ప్రభుత్వం రూ.1.6 కోట్లు కేటాయించింది. తాజాగా కొత్త రూపు సంతరించుకున్న 134 వాహనాలు పెట్రోలింగ్​ సేవల్లో ఆదివారం తిరిగి చేరాయి. టీఎస్​ నుంచి టీజీకి మార్పులో భాగంగా తెలంగాణ పోలీస్​ అనే స్టిక్కర్లను పోలీస్​ వాహనాలకు అతికించారు.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...