Vaibhav Suryavanshi | ఐపీఎల్​లో 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సీనియర్​ బౌలర్లనూ ఉతికారేసిన చిన్నోడు..!
Vaibhav Suryavanshi | ఐపీఎల్​లో 14 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. సీనియర్​ బౌలర్లనూ ఉతికారేసిన చిన్నోడు..!

Akshara Today: RR vs GT : ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​ 2025) Indian Premier League – IPL 2025)లో రాజస్థాన్​ రాయల్స్ Rajasthan Royals  తరఫున ఆడుతూ అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ vaibhav suryavamshi అరుదైన రికార్డు నమోదు చేశాడు.

గుజరాత్​ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్​లో గుజరాత్​ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మొదట 17 బంతుల్లో 51 పరుగులు చేసి, ఆఫ్​ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్లో రెండు సిక్స్ లు, ఓ ఫోర్ కొట్టాడు.

ఆ తర్వాత 35 బంతుల్లో ఏకంగా సెంచరీ కొట్టి రికార్డు నెలకొల్పాడు. కరీం జనత్​ వేసిన ఓవర్లో వరుసగా 6 , 4 , 6, 4 , 4 , 6 బాదేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు.