అక్షరటుడే, వెబ్‌డెస్క్: WPL 2026 | డబ్ల్యూపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) RCB జట్టు అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలు సాధించిన ఆర్సీబీ, 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం ద్వారా ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.
గుజరాత్ (Gujarat Giants)తో జరిగిన మ్యాచ్‌లో గౌతమి నాయక్ (Gautami Naik) ఆడిన 73 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆమె బ్యాటింగ్‌కు తోడుగా ఆర్సీబీ బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తిగా కట్టడి చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ చూపిస్తూ ఆర్సీబీ ప్రస్తుతం టోర్నీలో ముందంజలో ఉంది
WPL 2026 | ముంబైకి షాక్ ఇచ్చిన ఢిల్లీ
ఇదే సమయంలో మంగళవారం వడోదర వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ అజేయంగా 51 పరుగులు చేసి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో మళ్లీ బలంగా నిలబడగా, ముంబైకి మాత్రం ఈ ఓటమి హెచ్చరికగా మారింది. ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, వారి నెట్ రన్ రేట్ మరియు మిగిలిన మ్యాచ్‌ల ఫలితాలే ప్లే ఆఫ్స్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ తప్ప మిగిలిన నాలుగు జట్లు చెరో 4 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. ముంబై ఒక మ్యాచ్ అదనంగా ఆడినప్పటికీ, టాప్–3 స్థానాల కోసం పోటీ తీవ్రంగా మారింది. దీంతో ఇకపై ప్రతి మ్యాచ్‌లో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషించనుంది.
ప్లే ఆఫ్స్ సమీకరణాలు ఇలా..
ముంబై ఇండియన్స్: మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి.
యూపీ వారియర్స్ & గుజరాత్ జెయింట్స్: భారీ విజయాలు సాధిస్తేనే టాప్–3లోకి వెళ్లే అవకాశం.
ఢిల్లీ క్యాపిటల్స్: ముంబైపై గెలుపుతో వచ్చిన ఊపును కొనసాగిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు బలపడతాయి.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు ఉత్కంఠగా సాగుతుంది. వ్యక్తిగత రికార్డుల పోటీ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. బ్యాటింగ్‌లో యూపీ వారియర్స్‌కు చెందిన ఫీబీ లిచ్‌ఫీల్డ్ (211 పరుగులు) ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉండగా, బౌలింగ్ విభాగంలో ఆర్సీబీ స్టార్ నాడిన్ డి క్లెర్క్ (10 వికెట్లు) పర్పుల్ క్యాప్‌ను దక్కించుకుంది. మొత్తంగా చూస్తే డబ్ల్యూపీఎల్ 2026 టోర్నీ కీలక మలుపు దశకు చేరుకుంది. ఆర్సీబీ దూకుడు కొనసాగుతుండగా, మిగిలిన జట్లకు ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. అభిమానులకు మాత్రం రానున్న మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారనున్నాయి.