ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​​ Nizamabad City | నగరంలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు.. కత్తులతో హల్​చల్

    ​ Nizamabad City | నగరంలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు.. కత్తులతో హల్​చల్

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​ Nizamabad City | నగరంలో రౌడీ షీటర్లు రెచ్చిపోయారు. కత్తులు, తల్వార్లతో హల్​చల్​ చేశారు. ​నగరంలో కొంతకాలంగా రౌడీ షీటర్ల కదలికలు అంతగా లేవు. సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) బాధ్యతలు స్వీకరించిన తర్వాత కఠిన చర్యలు చేపట్టడంతో గతంలో ఉన్న గ్యాంగులు సైలంట్​ అయిపోయాయి. అయితే తాజాగా నగరంలోని ఆటోనగర్​లో (Auto Nagar) రౌడీ షీటర్​ ఆరిఫ్​ గ్యాంగ్​ సభ్యులు హల్ చల్​ చేశారు.

    Nizamabad City | బర్త్​డే వేడుకల్లో..

    ఆటోనగర్​లో సోమవారం రాత్రి అఫు అనే వ్యక్తి బర్త్ డే వేడుకల్లో (birthday celebrations) ఆరిఫ్ గ్యాంగ్ హల్​చల్​ చేసింది. నడిరోడ్డుపై తల్వార్లు, కత్తులతో యువకులు హంగామా చేశారు. నగరంలో ఒకప్పుడు జంగిల్​ ఇబ్బు, ఆరిఫ్​ డాన్​లు వేరువేరుగా​ గ్యాంగ్​లు మెయింటెన్​ చేసేవారు. నగరంలో జరిగిన ఓ పార్టీలో జంగిల్​ ఇబ్బును ఆరిఫ్​ గ్యాంగ్​ హతమార్చింది. అనంతరం జైలుకు వెళ్లి వచ్చిన ఆరిఫ్​ డాన్​ను జంగిల్​ ఇబ్బు గ్యాంగ్​ హత్య చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి హత్య తర్వాత రెండు గ్యాంగ్​లు సైలెంట్​ అయిపోయాయి.

    మరోవైపు సీపీ సాయిచైతన్య జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దుకాణాలు తెరిచినా వారిపై సైతం చర్యలు చేపడుతున్నారు. రాత్రిపూట గుంపులుగా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలో కొంతకాలంగా రౌడీ షీటర్ల కదలికలు తగ్గిపోయాయి. అయితే సోమవారం రాత్రి పుట్టిన రోజు వేడుకల పేరిట ఆరిఫ్​ గ్యాంగ్​ కత్తులు, తల్వార్లతో బైక్​పై ర్యాలీ తీయడం గమనార్హం. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

    Latest articles

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే...

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్...

    More like this