అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: CP Sai Chaitanya | నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై సీసీ సాయిచైతన్య (CP Sai Chaitanya) కొరడా ఝులిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఒకరిని జిల్లా బహిష్కరణ చేసిన ఆయన తాజాగా రౌడీషీటర్ ఫిద్దును (rowdy sheeter Fiddhu) జిల్లా నుంచి బహిష్కరించారు. ఈ మేరకు పోలీసులు సోమవారం ఫిద్దుకు ఉత్తర్వులు అందజేశారు.
CP Sai Chaitanya | ఐదో టౌన్ పరిధిలో..
ఐదో టౌన్ పరిధిలో ఉన్న నాగారం కాలనీకి చెందిన మహమూద్ బేగ్ అలియాస్ ఫిద్దు అనే రౌడీ షీటర్‌పై జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక కేసులు ఉన్నాయి. అయితే ఫిద్దు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇతను గతంలో ఓ హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుండడంతో జిల్లా నుంచి బహిష్కరణ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.