అక్షరటుడే, ఇందూరు: రోటరీ క్లబ్ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులను తీసుకొస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal Suryanarayana Gupta) తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ (Rotary Club of Nizamabad), రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని (World Disabled Day) పురస్కరించుకొని బుధవారం ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగులకు కృత్రిమ కాలును అమర్చి వారిలో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్న రోటరీ క్లబ్ ట్రస్ట్‌కు (Rotary Club Trust) అభినందనలు తెలిపారు. దివ్యాంగుల పునరావాసం సాధికారత కోసం రోటరీ క్లబ్ చేస్తున్న సేవలు అద్వితీయమన్నారు. తన ట్రస్టు ద్వారా ఇకపై ప్రతి సంవత్సరం రూ. రెండు లక్షల ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్యాం అగర్వాల్, కార్యదర్శి గోవింద్ జవహర్, ఎన్ఆర్సీటీ ఛైర్మన్ అశోక్, కోశాధికారి జుగల్ జాజు, బీజేపీ నాయకులు క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
