Homeక్రీడలుRohit Sharma | రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు కారణం అదేనా..!

Rohit Sharma | రోహిత్ శర్మ రిటైర్మెంట్ కు కారణం అదేనా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా team india కెప్టెన్ రోహిత్ శర్మ rohit sharma సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బుధవారం తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘అందరికీ హలో.. నేను టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నాను. సుదీర్ఘ ఫార్మాట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఈ ప్రయాణంలో నాపై మీరు చూపించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాను.’అని రోహిత్ తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు.

Rohit Sharma | సెలెక్టర్ల నిర్ణయంతోనే రిటైర్మెంట్..?

ఆకస్మాత్తుగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ captancy బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించారని బుధవారం జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన కాసేపటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత సెలెక్టర్ల నిర్ణయం నచ్చకనే రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడనే అభిప్రాయం సోషల్ మీడియా social media వేదికగా వ్యక్తమవుతోంది.

రోహిత్ rohit, విరాట్ కోహ్లీ virat kohliల భవితవ్యంపై సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ghambir చెప్పిన 24 గంటల వ్యవధిలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం నచ్చకనే రోహిత్ వీడ్కోలు పలికాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. రోహిత్ శర్మకు ఘన వీడ్కోలు దక్కాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

Rohit Sharma | అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ..

2013లో వెస్టిండీస్‌తో కోల్‌కతా kolkata వేదికగా జరిగిన మ్యాచ్‌తో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేశాడు. తన తొలి ఇన్నింగ్స్‌లోనే 177 పరుగులు చేసి తన రాకను ఘనంగా చాటుకున్నాడు. కానీ ఆ జోరును కొనసాగించలేక జట్టుకు దూరమయ్యాడు. 2019లో ఓపెనర్‌గా ప్రమోషన్ అందుకోవడం రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్‌ test career కు టర్నింగ్ పాయింట్ turning point. ఆ తర్వాత రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు.

సెహ్వాగ్ తరహా దూకుడైన బ్యాటింగ్‌తో భారత్‌కు అదిరిపోయే ఆరంభాలు అందించాడు. ఓపెనర్‌గా తన తొలి సిరీస్‌లోనే సౌతాఫ్రికా south africaపై రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 212 పరగులు చేశాడు. ఇదే అతనికి ఏకైక టెస్ట్ డబుల్ సెంచరీ..అత్యధిక వ్యక్తిగత టెస్ట్ స్కోర్.

Rohit Sharma | విదేశాల్లో విఫలం..

స్వదేశంలో సత్తా చాటినా.. విదేశాల్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. తన కెరీర్‌లో విదేశాల్లో రెండు సెంచరీలు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్ england, ఆస్ట్రేలియాపై ఆ సెంచరీలు బాదాడు. విరాట్ కోహ్లీ అనంతరం 2022లో టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోహిత్.. ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాడు. రోహిత్ సారథ్యంలో భారత్ డబ్ల్యూటీసీ WTC 2023 ఫైనల్లో ఓడిపోవడంతో పాటు డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ కూడా చేరలేదు.

న్యూజిలాండ్ చేతిలో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ అయ్యింది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ భారత్ ఘోర పరాజయం చవిచూసింది. 1-3తో సిరీస్ కోల్పోయింది. ఈ రెండు సిరీస్‌ల్లోనూ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. పేలవ బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో ఆఖరి టెస్ట్‌కు స్వయంగా తప్పుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలోనే తుది జట్టు నుంచి స్వయంగా తప్పుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. ఆ సమయంలోనే రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అంతా భావించారు.

Must Read
Related News