అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IND vs SA | రాంచీలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా మాత్రమే కాకుండా, రికార్డుల పరంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రత్యేకంగా టీమిండియా (Team India) సీనియర్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) ఒక్క మ్యాచ్‌లో రెండు భారీ ప్రపంచ రికార్డులను నమోదు చేసి చరిత్ర సృష్టించారు.
IND vs SA | ఈ మ్యాచ్‌లో నమోదైన టాప్ 10 రికార్డులు ఇవి :
వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు.. రోహిత్ శర్మ కొత్త చరిత్ర
20వ ఓవర్‌లో మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో సిక్స్ బాది, రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. అతను షాహిద్ అఫ్రిది (351 సిక్స్‌లు) రికార్డును అధిగమించాడు.
ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు — కోహ్లీ వరల్డ్ రికార్డ్
రోహిత్‌తో పాటు కోహ్లీ కూడా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సాధించిన అతని 52వ వన్డే సెంచరీ, ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నమోదయ్యేలా చేసింది. మునుపటి రికార్డు: సచిన్ టెండూల్కర్ — 51 టెస్ట్ సెంచరీలు.
అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ & కోహ్లీ
ఈ మ్యాచ్‌తో రోహిత్–కోహ్లీ జంట కలిసి 392 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. గతంలో సచిన్–ద్రవిడ్ (391 మ్యాచ్‌లు) ఆడగా, వారిని ఈ జంట అధిగమించారు.
వన్డేల్లో 52వ 50+ భాగస్వామ్యం — రోహిత్ & కోహ్లీ
ఈ మ్యాచ్‌లో ఇద్దరూ తమ 52 సార్లు యాభైకి పైగా భాగస్వామ్యాన్ని నమోదుచేశారు. భారత రికార్డు చూస్తే.. సచిన్–గంగూలీ: 83, సచిన్–ద్రవిడ్: 74, సెహ్వాగ్–గంభీర్: 53
దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు — కోహ్లీ అగ్రస్థానం
దక్షిణాఫ్రికాపై కోహ్లీ ఇప్పుడు అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచారు. 30 మ్యాచ్‌లలో 6 సెంచరీలు కోహ్లీ చేయగా, అతని తర్వాత: డేవిడ్ వార్నర్ 5 సెంచరీలు చేశారు.
వన్డేల్లో 20వ సెంచరీ భాగస్వామ్యం — రోహిత్ & కోహ్లీ
ఇద్దరూ కలిసి వన్డేల్లో 20వ సెంచరీ భాగస్వామ్యాన్ని చేశారు. ఈ విభాగంలో అగ్రస్థానం సచిన్–గంగూలీ( 26 సార్లు )
దక్షిణాఫ్రికాపై రోహిత్ 2,000 పరుగులు పూర్తి
రోహిత్ శర్మ (Rohit Sharma) తన అంతర్జాతీయ కెరీర్‌లో దక్షిణాఫ్రికాపై 2,030 పరుగులు నమోదు చేశాడు.
ఈ జాబితాలో అగ్రస్థానం: సచిన్ టెండూల్కర్ — 3,752 పరుగులు
రాంచీలో కోహ్లీ మూడో సెంచరీ
ఈ మ్యాచ్‌తో రాంచీలో కోహ్లీ తన మూడో వన్డే సెంచరీని సాధించాడు. కేవలం 5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, ఇది భారతదేశంలో ఒకే వేదికపై అత్యధిక సెంచరీల రికార్డు.
రాంచీలో భారత అత్యధిక వన్డే స్కోరు
టీమిండియా ఈ మ్యాచ్‌లో 349/8 పరుగులు చేసింది.ఇది రాంచీ వేదికపై ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్కోరు. గత రికార్డు చూస్తే.. ఆస్ట్రేలియా (2019) — 313/5
వరుసగా 19వ సారి టాస్ ఓటమి — భారత్ విచిత్ర రికార్డు
భారత్ వరుసగా 19 వన్డేల్లో టాస్ ఓడిపోవడం అరుదైన రికార్డు. ఇది అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లో చెత్త టాస్ పరాజయ పరంపర. మొత్తంగా రోహిత్–కోహ్లీ ద్వయం ధాటిగా రాణించడంతో భారీ స్కోరు చేసిన భారత జట్టు, కీలక సమయాల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో 17 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో ఉంది.
