అక్షరటుడే, ఇందూరు: Robotics | ప్రస్తుత సమాజంలో రోబోటిక్స్‌కు ప్రాధాన్యత పెరుగుతోందని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Giriraj Government Degree College) ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారత్నం అన్నారు. భౌతిక శాస్త్రం సోహం అకాడమీ (Physics Soham Academy) సంయుక్త ఆధ్వర్యంలో రోబోటిక్స్‌పై కార్యశాల నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో అన్ని రంగాల్లో రోబోల వాడకం సర్వసాధారణమవుతోందన్నారు. కార్యశాలలో నేర్పించిన అంశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రైనర్లుగా మల్లికార్జున్, రాజా వర్ధన్, అక్షయ వ్యవహరించారు. కార్యక్రమంలో కార్యశాల సమన్వయకర్త డాక్టర్ రామకృష్ణ, సోహం అకాడమీ డైరెక్టర్ సహదేవ్, పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్, డాక్టర్ రాజేష్, జయప్రకాష్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.