అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Nizamabad Police | రైస్‌మిల్ వ్యాపారం చేస్తే తక్కువ కాలంలోనే ఎక్కువ లాభం వస్తుందని నమ్మించి ఓ వ్యక్తిని నిలువు దోపిడీ చేసిన ముఠాను నాలుగో టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్‌హెచ్‌వో సతీష్ కుమార్ (SHO Satish Kumar) వెల్లడించారు.
నగరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇటీవల ముగ్గురు వ్యక్తులు పరిచయమయ్యారు. రైస్‌మిల్ వ్యాపారం (Rice Mill Business) చేస్తే తక్కువ సమయంలోనే అధిక లాభాలు గడించవచ్చని ఆయనను వారు నమ్మించారు. ఈ క్రమంలో ముగ్గురు వ్యక్తులు కలిసి నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్లో దావత్ పేరుతో బీరులో మత్తుమందు కలిపి శ్రీనివాస్‌తో తాగించారు. అనంతరం అతడు అపస్మాకర స్థితికి చేరుకోగానే రెండు బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దోచుకుని పారిపోయారు. అనంతరం తేరుకున్న శ్రీనివాస్ తాను మోసపోయానని గుర్తించి నాలుగో టౌన్ పోలీసులకు (4th Town Police) ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పుటేజీ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసి నిందితులు బాత ప్రసాదం, నర్సింగరావు, రుద్రా యాదవ్‌ను అదుపులోకి తీసుని విచారించారు. కాగా నేరాన్ని వారు ఒప్పుకున్నారని.. చోరీ చేసిన బంగారాన్ని హైదరాబాద్కు (Hyderabad) చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద తాకట్టు పెట్టినట్లు తెలిపారని పోలీసులు తెలిపారు. అనంతరం ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై ఉదయ్‌కుమార్, ఎస్సై సందీప్‌కుమార్ పాల్గొన్నారు. అలాగే కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు శేఖర్, రమేష్, నగేష్, ఏఎస్సై రవీందర్, సిబ్బందిని సీఐ అభినందించారు.