Police | హంగర్గలో దొంగల బీభత్సం.. బంగారంతో పాటు బైకు చోరీ

అక్షరటుడే, కోటగిరి: Police : పోతంగల్ మండలంలోని హంగర్గలో దొంగలు బీభత్సం సృష్టించారు. వేసవి కాలం కావడంతో చల్లదనం కోసం దాబాపై కుటుంబ సభ్యులు పడుకుంటే.. కింద ఇంట్లో చొరబడి సొత్తు దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హంగర్గ గ్రామానికి చెందిన పుట్టి రాములు, కుటుంబీకులు వేసవి కాలం కావడంతో సోమవారం రాత్రి దాబాపై నిద్రించారు. తెల్లవారిలేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఆందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే.. బీరువా […]

అక్షరటుడే, కోటగిరి: Police : పోతంగల్ మండలంలోని హంగర్గలో దొంగలు బీభత్సం సృష్టించారు. వేసవి కాలం కావడంతో చల్లదనం కోసం దాబాపై కుటుంబ సభ్యులు పడుకుంటే.. కింద ఇంట్లో చొరబడి సొత్తు దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హంగర్గ గ్రామానికి చెందిన పుట్టి రాములు, కుటుంబీకులు వేసవి కాలం కావడంతో సోమవారం రాత్రి దాబాపై నిద్రించారు. తెల్లవారిలేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఆందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే.. బీరువా తెరిచి ఉంది.

బీరువాలో దాచిన ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండి, కొంత నగదు మాయమైంది. బయటకొచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం కూడా కనబడలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

ప్రపంచ వినికిడి దినోత్సవం వేళ భారత్‌లోకి ‘న్యూక్లియస్ నెక్సా’.. తొలి స్మార్ట్ హియరింగ్ ఇంప్లాంట్ సిస్టమ్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇంప్లాంట్ చేయగల శ్రవణ పరిష్కారాలలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ 'కాక్లియర్' (Cochlear) ఒక సంచలన ఆవిష్కరణను భారత...

India vs West Indies | సూపర్-8లో క్లైమాక్స్.. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్–వెస్టిండీస్ ‘వర్చువల్ క్వార్టర్ ఫైనల్’

టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశ ఉత్కంఠభరితంగా మారింది. జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్, ఇప్పుడు వెస్టిండీస్‌తో జరిగే కీలక పోరులో గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

Godrej Interio: ఇళ్లకు కొత్త సొబగులు.. సాఫ్ట్ ఫర్నిషింగ్స్ రంగంలోకి గోద్రేజ్ ఇంటీరియో భారీ విస్తరణ

హైదరాబాద్: ప్రముఖ ఫర్నిచర్ దిగ్గజం, గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌నకు చెందిన 'గోద్రేజ్ ఇంటీరియో' తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ 'సాఫ్ట్ ఫర్నిషింగ్స్' విభాగంలోకి అడుగుపెట్టింది....

Protein Day: ప్రోటీన్ కండరాల పుష్టికే కాదు.. ఇంటిల్లిపాదికీ ఒక నిత్యావసరం!

హైదరాబాద్: గతంలో భారతీయ ఇళ్లలో వంట అంటే కేవలం కడుపు నింపే ఆహారం, బడ్జెట్ మరియు రుచికి మాత్రమే ప్రాధాన్యత ఉండేది. పప్పు, పాలు,...