అక్షరటుడే, ఆర్మూర్: Aloor | ఆలూర్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి భారీగా బంగారం (Gold), వెండి (Silver), నగదు అపహరించారు.
బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్కు (Aloor) చెందిన పుల్లెల రాము అతని భార్య పిల్లలతో సహా నవంబర్ 27 గురువారం మధ్యాహ్నం వారి మామ దినకర్మలకు వేరే ఊరికి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తాళం ధ్వంసం చేసి కనబడింది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను పగులగొట్టి అందులో ఉన్న 14 తులాల బంగారం, సుమారు అర కిలో వెండి, లక్ష రూపాయలు నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
