అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 31 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya ) తన కార్యాలయంలో ఆదివారం వివరాలు వెల్లడించారు.
నిజామాబాద్‌కు చెందిన షేక్ సల్మాన్, మరాటి ఆకాష్ రావు, షేక్ సాదక్, వినోద్, రమేష్ చవాన్, ముక్తే సాయినాథ్ ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. జల్సాలకు డబ్బులు సరిపోవడం లేదని దొంగతనాలు (Thefts) చేయడం ప్రారంభించారు. షేక్ సాదక్ ముఠాకు లీడర్‌గా ఉంటూ నడిపిస్తున్నాడు. తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి వీరు చోరీలకు పాల్పడుతున్నారు.
CP Sai Chaitanya | ఇలా దొరికారు..
నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలనీకి చెందిన వేలేటి పవన్ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 33 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ.30 వేల నగదు దొంగతనం జరిగిందని ఆయన ఈ నెల 23న ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు (police) ఆదివారం ఉదయం నాగారం డబుల్ బెడ్ రూమ్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని ముఠా సభ్యులు షేక్ సల్మాన్, మరాఠీ ఆకాశరావులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 31 తులాల బంగారం ఆభరణాలు, ఆటో, మొబైల్ ఫోన్ స్వాధీం చేసుకున్నారు.
ఏసీపీ రాజా వెంకటరెడ్డి (ACP Raja Venkat Reddy) ఆధ్వర్యంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ ఈ కేసును ఛేదించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని సీపీ తెలిపారు.