Homeజిల్లాలునిజామాబాద్​Railway overbridges | ఆర్​వోబీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

Railway overbridges | ఆర్​వోబీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఆర్​వోబీల పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్​లో ఆయా శాఖ​ల అధికారులతో ఆయన మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Railway overbridges | జిల్లాలో కొనసాగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) ఆయా అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మాధవ్​నగర్ ఆర్​వోబీకి రూ.3.15 కోట్లు, అర్సపల్లికి రూ.7.46 కోట్ల నిధులను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించిందన్నారు. కాబట్టి సకాలంలో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అలాగే పనులను సకాలంలో పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. అడవి మామిడిపల్లి వద్ద బీటి రోడ్డు పనులను పూర్తి చేసి, డిసెంబర్ 15వ తేదీ లోపు వంతెనను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు.

Railway overbridges | నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

ఇటీవల కురిసిన భారీ వర్షాల (heavy rains) వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగు మారిన, దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని, మరో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. సమీక్షలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Must Read
Related News