అక్షరటుడే, ఇందూరు : BJP MLA | జిల్లాలోని ఆర్వోబీల పనులను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి(Dinesh Kulachari) డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు వెళ్లిన బీజేపీ నాయకులను శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రికి తెలిపేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. జిల్లాలో మాధవనగర్, అడవి మామిడిపల్లి, అర్సపల్లి ఆర్వోబీ(ROB)లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదన్నారు. సీఎంను కలిసి సమస్యలు చెప్పాలనుకుంటే అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
BJP MLAs | పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన..
జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయం నుంచి నిఖిల్ సాయి చౌరస్తాలో నిరసన తెలపడానికి వెళ్లిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఒక దశలో పోలీసులు, నాయకులకు తోపులాట చోటుచేసుకుంది.
BJP MLAs | కలెక్టరేట్లో బీజేపీ ఎమ్మెల్యేల భైఠాయింపు..
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కొత్త కలెక్టరేట్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా సమస్యల పరిష్కరించాలంటూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా(Urban MLA Dhanpal), ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి(MLA Rakesh Reddy)లు కలెక్టరేట్లో భైఠాయించి నల్ల బడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను సీఎంకు వివరిస్తామంటూ నినాదాలు చేశారు.